Abn logo
Sep 23 2020 @ 12:14PM

ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రతిభావంతుల జాబితాలో ఆయుష్మాన్ ఖురానా!

Kaakateeya

ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన 100 మంది జాబితాలో బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా పేరును టైమ్ మ్యాగజైన్ జతచేర్చింది. ఈ జాబితాలో ఉన్నవారిలో ఆయుష్మాన్ ఖురానా పిన్నవయస్కుడైన భారతీయుడు. అత్యంత ప్రతిభావంతులైన కళాకారుల క్యాటగిరీలో ఆయుష్మాన్ ఖురానా పేరును పొందుపరిచారు. ఈ విషయాన్ని ఆయుష్మాన్ ఖురానా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఈ పోస్టును చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ పోస్టును లైక్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నటుడు ఆయుష్మాన్ ఖురానాకు అభినందనలు తెలిపారు. ఆయుష్మాన్ నటించిన విక్కీ డోనర్ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ సినిమాలో ఆయుష్మాన్ ఎంతో ప్రతిభ చూపారన్నారు.


Advertisement
Advertisement
Advertisement