Abn logo
Sep 16 2021 @ 23:16PM

పోషణ మాసంపై అవగాహన ర్యాలీ

రెబ్బెనలో ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు, అధికారులు

రెబ్బెన, సెప్టెంబరు 16: మండలకేంద్రంలో గురువారం పోషణమాసం అవగాహన ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంగన్‌వాడీకేంద్రాల్లో పోషకాహారం తీసుకో వాలన్నారు. ఎంపీపీ సౌందర్య, జడ్పీటీసీ సంతోష్‌, ఎస్సై భవానీసేన్‌, సర్పంచ్‌ అహల్యాదేవి, తదితరులు పాల్గొన్నారు.

దహెగాం: మండలకేంద్రంలో అంగన్‌వాడీకార్యక ర్తలు, విద్యార్థులు, సూపర్‌వైజర్‌ సుధారాణి ఆధ్వ ర్యం లో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మొలకెత్తిన విత్తనాలు, ఆకుకూరలు, పాలు, పండ్లు సమపాళ్లలో తీసుకోవాలన్నారు.

కౌటాల: మండలకేంద్రంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు తీసుకోవాల్సిన పోషకాహా రంపై అవగాహన కల్పిం చారు.

బెజ్జూరు: మండలకేంద్రం లో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహిం చారు. ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ ప్రేమజ్యోతి, డీటీ విలాస్‌, ఆర్‌ఐ గోపినాథ్‌ పౌష్టి కాహారంపై అవగాహన కల్పించారు.