Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులను బ్లాక్‌మెయిల్‌ చేయడం మానుకోవాలి : బీజేపీ

సోన్‌, డిసెంబరు 2 : యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని, వరిసాగు చేయొద్దని రైతులను బ్లాక్‌మెయిన్‌ చేయడం మానుకోవాలని బీజేపీ కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్‌ రావులరాంనాథ్‌ అన్నారు. మండలంలోని మాదాపూర్‌ గ్రామంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వర్షాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు పండించిన ప్రతీగింజను కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్‌ ఎందుకు కొనుగోలు చేయడం లేదో రైతులకు చెప్పాలని అన్నారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకుండా చేయాలని కేసీఆర్‌ కుట్రలు పన్నారన్నారని ఆరోపించారు. నిర్మల్‌ నియోజకవర్గంలో వరి పంట అధికంగా సాగుచేస్తారని గుర్తు చేశారు. ప్రత్యామ్నాయ పంటలుసాగు చేయాలంటే మంత్రులు, అధికారులు రైతులపై ఒత్తిడి తీసుకురావడం సరి కాదని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ను తప్పుదోవ పట్టించొద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షు డు మ్యాక ప్రేమ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి మేకల అశోక్‌, కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు సొన్నపేట గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement