Abn logo
Jul 11 2020 @ 06:10AM

మూడేళ్లలో ఎయిర్‌పోర్టు నిర్మాణం..

ఏవియేషన్‌ కార్పొరేషన్‌ ఎండీ భరతరెడ్డి


భోగాపురం, జూలై 10: భోగాపురంలో నిర్మించబోతు న్న అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని వచ్చే మూడేళ్లలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని ఏవియేషన్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్వీ భరతరెడ్డి తెలిపారు. మండలంలోని జాతీయ రహదారి సమీప ఎయిర్‌పోర్టు భూములను ఆయన శుక్రవారం పరిశీలించారు. అలాగే ఎయిర్‌పోర్టు నుంచి జాతీయ రహదారిని కలిసే వంతెనను పరిశీలించారు. అనంతరం జేసీ కిశోర్‌కుమార్‌తో చర్చించా రు.


ఇప్పటివరకు ఎంత భూమి సేకరించారు, ఇంకా ఎంత సేకరించాల్సి ఉంది, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించి నిర్వాసితులకు అందజేయవలసిన పరిహారంపై అడిగి తెలసుకున్నారు. దీనిపై జేసీ మాట్లాడుతూ నష్ట పరిహారం అందరికీ అందజేశా మని, అయితే కొంతమంది రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, వారి భూములు పెండింగులో ఉన్నాయని, వారితో చర్చించి త్వరలోనే భూములు సేకరిస్తామని తెలిపారు. అనంత రం ఎండీ మాట్లాడుతూ త్వరలోనే ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు చేపట్టి, వచ్చే మూడేళ్లలో పూర్తి చేసేలా చూస్తామని స్పష్టంచేశారు.


అలాగే నిర్వాసి తులతో మాట్లాడి, వారికి ఇబ్బందులు లేకుండా చర్య లు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఏ డీసీఎల్‌ టెక్నికల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.రాజ గోపాల్‌, శ్రీకాకుళం డీఆర్వో దయానిధి, ఇన్‌చార్జి ఆర్డీవో సాల్మన్‌రాజ్‌, ఎస్‌డీసీలు బాలత్రిపురసుందరి, జయ రాం, పార్వతీపురం ఎస్‌డీసీ వెంకటేష్‌, డీసెక్షన్‌ అధికా రి సూర్యలక్ష్మి, తహసీల్దార్‌ అప్పలనాయుడు, సీఐ సీహెచ్‌ శ్రీధర్‌, ఎస్‌ఐ యు.మహేష్‌, హెచ్‌డీటీ గాంధీ, సర్వేయర్లు వెంకటపతిరాజు, ఆర్‌.సింహాచలం పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement