Abn logo
May 3 2021 @ 00:07AM

నవ్వుతో పెరిగే ఆయుష్షు

గుంటూరు, మే 2: హాయిగా నవ్వుకోవటం వెలకట్టలేని ఆనందమని, నవ్వుతో ఆయుష్షు పెరుగుతుందని ఇంజనీర్‌ ఘనశ్యామాచార్యులు తెలిపారు. ప్రపంచ నవ్వుల దినోత్సవం  సందర్భంగా అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నవ్వు ఆందరికీ అర్ధమయ్యే భాష అని, అది మనిషికి పెట్టని ఆభరణమని వివరించారు. ప్రశాంతతకు ఓ మార్గమన్నారు. నవ్వుని మించిన సౌందర్యం మరొకటి ఉండదన్నారు. కార్యక్రమంలో అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, భాగ్యలక్ష్మి, జగన్మోహన్‌రావు, రాజశేఖర్‌, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement