Abn logo
May 26 2020 @ 03:17AM

టీ20 పగ్గాలు రోహిత్‌కివ్వాలి

 అతుల్‌ వాసన్‌

న్యూఢిల్లీ: భిన్న జట్లకు భిన్న కెప్టెన్ల ఫార్ములాను టీమిండియాకు అమలు చేయాలని మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అతుల్‌ వాసన్‌ సూచించాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు విరాట్‌ కోహ్లీనే సారథిగా ఉన్నాడు. విరాట్‌పై ఒత్తిడి పడకుండా టీ20 కెప్టెన్సీని రోహిత్‌ శర్మకు అప్పగించాలని అతుల్‌ పేర్కొన్నాడు. ‘రోహిత్‌ నేర్పుగల నాయకుడు. ఈ విషయాన్ని విరాట్‌ గైర్హాజరీలో నిరూపించుకున్నాడు కూడా. అందుకే వన్డే, టెస్టు సారథ్యాన్ని విరాట్‌కు పరిమితం చేసి.. రోహిత్‌ను టీ20 కెప్టెన్‌ చేయాలి’ అని వాసన్‌ అన్నాడు. 

Advertisement
Advertisement
Advertisement