Sep 28 2021 @ 14:35PM

షాకింగ్ అనుభవాన్ని గుర్తు చేసుకున్న Atul Kulkarni.. థియేటర్ ముందు నిలబడి ఉండగా ఓ యువతి వచ్చి..

అతుల్ కుల్‌కర్ణి.. తెలుగుతో పాటు పలు భాషల చిత్రాల్లో మెరిసిన ఈ ప్రముఖ నటుడు తను నటించిన రెండో సినిమాతోనే ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. 2001లో విడుదలైన `చాందినీ బార్` సినిమాతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ముంబైలోని ఓ బార్ గర్ల్ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రంలో అతుల్.. గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు. తన నటనతో ప్రేక్షకులందరినీ మెప్పించాడు. ఆ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను అతుల్ పంచుకున్నాడు. 


ఆ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. `సినిమా విడుదలకు ముందు ఓ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశాం. నిజ జీవిత బార్ గాళ్స్ కోసం ఆ షో వేశాం. ఆ షో పూర్తయిన తర్వాత నేను థియేటర్ బయట నిల్చుని ఉన్నాను. అప్పుడు ఓ బార్ గర్ల్ నా దగ్గరకు వచ్చి.. `సినిమాలో బార్ గర్ల్‌ను పెళ్లి చేసుకున్నందుకు ధన్యవాదాలు` అని చెప్పి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయింద`ని అతుల్ తెలిపాడు. ఇన్ని సంవత్సరాలైనా ఆ విషయాన్ని మాత్రం తాను మర్చిపోలేదని చెప్పాడు. 

Bollywoodమరిన్ని...