Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాలికపై అత్యాచారయత్నం

తల్లితో సహజీవనం సాగిస్తున్నవ్యక్తే నిందితుడు

కదిరి, డిసెంబరు 8: తనతో సహజీవనం చేస్తున్న మహిళ కూతురిపైనే కా మాంధుడు కన్నేశాడు. తల్లిలేని సమయ ంలో బిడ్డపై అత్యాచారానికి యత్నించాడు. విషయం బాలిక.. తల్లికి తెలపడంతో ఆమె బుధవారం పట్టణ పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేసింది. ఆ కేసు వివరాలను సీఐ సత్యబాబు వెల్లడించారు. తెలంగాణ రాష్టా్ట్రనికి చెందిన ఓ మహిళ 18 ఏళ్ల వయసులోనే కృష్ణా జిల్లా వాసిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. వారికి ఒక కుమార్తె, కు మారుడు పుట్టారు. కొడుకు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో అతడితో విడిపోయారు. ఆమె పిల్లలతో సహా హైదరాబాద్‌ వెళ్లింది. అక్కడ ఉండగా టెలీఫోన గుంతలు తీసుకుంటూ జీవనం సా గిస్తున్న నల్లమాడ మండల వాసితో పరిచయమైంది. తర్వాత ఇద్దరు కలిసి కదిరికి మకాం మార్చారు. ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆ మహిళ మొదటి భర్త కూతురు, కొడుకు కూడా వీరితోనే ఉంటున్నారు. ఆమె రెండో భర్త కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో ఈనెల 3న ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఇంటి వద్ద మొదటి భర్త కుమార్తె, కుమారుడు ఉన్నారు. దీనిని గమనించిన ఆమెతో సహజీవనం సాగిస్తున్న వ్యక్తి 3, 4 తేదీల్లో అర్ధరాత్రి సమయంలో ఆ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బుధవారం బాలుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతుండడంతో బాధిత బాలిక ఆస్పత్రికెళ్లింది. విషయాన్ని తల్లికి చెప్పింది. మహిళా పోలీసు సాయంతో ఆమె.. పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు అత్యాచారయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement
Advertisement