Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫుడ్‌ డెలివరీ బాయ్‌పై దాడి

గుంటూరు: స్విగీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న యువకుడిపై హోటల్‌ యమమాని, సిబ్బంది దాడికి పాల్పడ్డారు. అరండల్‌పేట పోలీసుల కథనం మేరకు.. రాజరాజేశ్వరపురానికి చెందిన పొట్లూరి సాయిబాబు బీటెక్‌ పూర్తి చేసి కరోనా నేపథ్యంలో డెలివరీ బాయ్‌గా చేరాడు. అయితే ఈ నెల 3న ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చిన ఆహార పదార్ధాలను తీసుకునేందుకు కొరిటెపాడులోని ఓ హోటల్‌కు వెళ్ళాడు. హోటల్‌ ముందు తను బైకును పార్క్‌ చేసే విషయమై వాచ్‌మెన్‌తో గొడవ జరిగింది. దీంతో హోటల్‌ యజమాని వచ్చి సాయిబాబును లోనికి తీసుకువెళ్ళి తనతోపాటు, సిబ్బందితో కలసి దాడి చేసి కొట్టారు. అంతేగాక కులంపేరుతో ధూషించారని బాధితుడు ఫిర్యాదు మేరకు హోటల్‌ యజమాని ప్రతాప్‌, సిబ్బంది రాజశేఖర్‌, సాయికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement