Abn logo
May 28 2020 @ 03:41AM

ఈశ్వరయ్యపై దాడి అమానుషం: పవన్‌

అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న దాడులపై చట్టపరంగా ముందుకు వెళ్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా మల్లాపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త మేకల ఈశ్వరయ్యపై వైసీ పీ వారు దాడికి పాల్పడడం అమానుషం అని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో పవన్‌ డిమాండ్‌ చేశారు. కాగా, కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన జనసైనికుడు బొమ్మదేవర చక్రి బుధవారం కొండపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారన్న వార్త తనను కలచి వేసిందన్నారు.


Advertisement
Advertisement
Advertisement