Abn logo
Jul 11 2020 @ 03:46AM

అంబేద్కర్‌ రాజగృహంపై దాడి అమానుషం

వికారాబాద్‌,(ఆంధ్రజ్యోతి)/వికారాబాద్‌/యాలాల : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ నివాసం, గ్రంథాలయమైన రాజగృహంపై  గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ధ్వంసం చేయడం చాలా అమానుషమని జిల్లా స్వేరోస్‌ ఇంటర్నేషనల్‌ బాఽధ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ శుక్రవారం రైల్వే స్టేషన్‌ జంక్షన్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్‌, కౌన్సిలర్‌ చందర్‌నాయక్‌, లక్ష్మణ్‌, స్వేరో కమిటీ బాధ్యులు వెంకటరత్నం, వీరన్న, డాక్టర్‌ గంగరాజు, పోచయ్య, శ్రీనివాస్‌, మహిపాల్‌, రవీందర్‌ పాల్గొన్నారు.  ముంబాయిలో బీఆర్‌.అంబేద్కర్‌ రాజగృహంపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని సీపీఎం మండల కార్యదర్శి బుగ్గప్ప, ఎమ్మార్పీఎస్‌ నాయకులు నర్సింహులు డిమాండ్‌ చేశారు.


శుక్రవారం యాలాలలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రమేష్‌, హన్మంతు, శివకుమార్‌, ఎల్లప్ప, షబ్బీర్‌, బి.రమేష్‌ పాల్గొన్నారు.కాగా రాజగృహంపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని జైభారత్‌, ఎస్సీ పోరాటవేదిక జిల్లా కార్యదర్శి నర్సింహులు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.  

Advertisement
Advertisement