Abn logo
Sep 21 2021 @ 21:07PM

కర్నూలు జిల్లాలో మహిళపై దాడి

కర్నూలు: జిల్లాలోని కోవెలకుంట్లలోగల స్వామినగర్ కాలనీలో దారుణం జరిగింది. వెంకటమ్మ అనే మహిళపై అదే కాలనీకి చెందిన వ్యక్తులు నడి రోడ్డుపై కర్రలు, రాళ్లతో దాడి చేసారు. దాడిలో వెంకటమ్మ తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం వెంకటమ్మను కోయిలకుంట్ల ఆసుపత్రికి తరలించారు. కూతురును వివాహం చేసుకునేందుకు ఇవ్వలేదనే కారణంతో దుండగులు దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. దాడి చేసిన వారిపై కోవెలకుంట్ల పోలీసులు కేసు నమోదు చేసారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...