Abn logo
Sep 17 2021 @ 00:49AM

పరిషత ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన సిగ్నల్‌

ఉత్కంఠకు తెర..!

పరిషత ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన సిగ్నల్‌

అభ్యర్థుల్లో ఉత్సాహం 

పలు కార్యక్రమాలు రద్దు.. 

ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

అనంతపురం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): 

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల గడువు లేకుండా పరిషత ఎన్నికల షె డ్యూల్‌ ఇచ్చారని, ఈ నేపథ్యంలో ఎన్నికలను రద్దు చేయాలని టీడీపీ, జనసేన సహా పలువురు అభ్యర్థులు హై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు సింగిల్‌  బెంచ ఆ ఎన్నికలను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించడంతో పాటు కొత్త షెడ్యూల్‌ విడుదల చేయాలని ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభు త్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీలుకు వెళ్లగా... ఆ మేరకు గురువారం హైకోర్టు డివిజన బెంచ పరిషత ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో... జిల్లాలో ఎన్నికలు జరిగిన 62 జడ్పీటీసీ, 782 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మార్గం సుగమమైంది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియపైనే స్పష్టత లేదు. ఈ నెల 19వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు ఎస్‌ఈసీ నోటిఫికేషన విడుదల చేసింది. 19వ తేదీ పరిషత ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది. 


జిల్లాలో పరిషత ఎన్నికల వివరాల్లోకి వెళ్తే....

గతేడాది మార్చిలో పరిషత్‌ ఎన్నికలకు అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ నోటిఫికేషన్‌విడుదల చేశారు. మార్చి 9వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 14న అనూహ్యంగా  ఎన్నికలను వాయిదా వేశారు. ఆ వివాదం నడుస్తుండగానే... ఈ ఏడాది ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని ఏప్రిల్‌ 1న పరిషత ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. దీంతో జిల్లాలోని 62 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి చిలమత్తూరు జడ్పీటీసీ అభ్యర్థి మరణించడంతో ఆ స్థానానికి ఎన్నికలు జరగలేదు. 841 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 50 స్థానాలు ఏకగ్రీవం కావడం, మరో 9 స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు మరణించడంతో.... 782 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 62 జడ్పీటీసీ స్థానాలకుగానూ వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిపి 245 మంది, 782 ఎంపీటీసీ స్థానాలకు 2,030 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న జిల్లావ్యాప్తంగా 2,665 పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్‌ నిర్వహించారు. 58.07 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో... బ్యాలెట్‌ బాక్సులను జిల్ల్లా వ్యాప్తంగా 17 సా్ట్రంగ్‌ రూమ్‌లలో భద్రపరిచారు. కాగా ఏప్రిల్‌ 10న కౌంటింగ్‌ నిర్వహించాల్సి ఉండగా టీడీపీ, జనసేన పార్టీలతో పాటు కొందరు అభ్యర్థులు ఈ ఎన్నికలను రద్దు చేయాలని కోర్టును ఆశ్ర యించారు. ఆ మేరకు మే 21న ఎన్నికల ప్రక్రియను హైకోర్టు సింగిల్‌ బెంచ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. కొత్త నోటిఫికేషన్‌ఇవ్వాలని అదే ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఈ తీర్పుపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన హైకోర్టును ఆశ్ర యించగా ఆగస్టులో విచారణ జరిగింది. ఆ మేరకు తీర్పును రిజర్వులో ఉంచారు.  గురువారం పరిషత ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయడంతో ఓట్ల లెక్కింపునకు అడ్డంకులు తొలగిపోయాయి. 


పరీక్షల నేపథ్యంలో కౌంటింగ్‌పై సందేహాలు

పరిషత ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో జిల్లా పరిషత్‌ అధికారులు అప్రమత్త మయ్యారు. కౌంటింగ్‌ తేదీపైనే ఆ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జ రుగుతున్న విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో సా్ట్రంగ్‌ రూమ్‌లు జూనియర్‌ కళాశాల్లోనే ఉన్నాయి. ఆ జూనియర్‌ కళాశాలల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పా ట్లు ఎలా చేయాలన్న సందేహంలో జడ్పీ అధికారులు పడ్డారు. జిల్లాలో 17 ప్రాంతాల్లో సా్ట్రంగ్‌ అండ్‌ కౌంటింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. కదిరిలోని జూనియర్‌ కళాశాల, జడ్పీ గర్ల్స్‌ హైస్కూల్‌, పాలిటెక్నిక్‌ కళాశాల, ధర్మవరంలోని బీఎ్‌సఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ బాయ్స్‌,  బీఎ్‌సఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ గర్ల్స్‌, గడ్డం వెంకటమ్మ ఎత్తిరాజుల జడ్పీ హైస్కూల్‌, ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, అనంతపురంలోని జేఎన్‌టీయూ, కేఎ్‌సఎన్‌ డిగ్రీ కళాశాల, పెనుకొండ, మడకశిర ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, హిందూపురంలోని ఎంజీఎం హైస్కూల్‌లో, కళ్యాణదుర్గంలోని కేసీజీ జూనియర్‌ కళాశాలలో, కేసీజీ హైస్కూల్‌, ఎస్‌బీజీఎం డిగ్రీ కళాశాల, మడకశిర ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో, గుంతకల్లులోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్‌ హైస్కూల్‌లో సా్ట్రంగ్‌ రూమ్స్‌ అండ్‌ కౌంటింగ్‌ కేంద్రాలుగా నిర్ణయించారు. ఇక్కడ కౌంటింగ్‌ ఏర్పాట్ల విషయంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉరవకొండ, కదిరి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో జూనియర్‌ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ మినహా 17వ తేదీ నుంచి వరుసగా ఉదయం, మఽధ్యాహ్నం 23వ తేదీ వరకూ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి. అయితే పరీక్షలు జరిగే ప్రాంతాల్లో కౌంటింగ్‌ నిర్వహించడం అసాధ్యం. దీంతో ఆదివారం సెలవు రోజు కావడంతో ఆ రోజు పరీక్షలు లేవు. ఆ రోజే కౌంటింగ్‌ నిర్వహించే విధంగా ఎస్‌ఈసీ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు అధికారులను ఏర్పాట్లలో నిమగ్నం చేసే పనిలో ఉన్నతాధికారులు బిజీగా ఉన్నారు. 


పలు కార్యక్రమాలు రద్దు..?

హైకోర్టు తీర్పు నేపథ్యంలో కౌంటింగ్‌  కోసం.. శుక్రవారం జరగాల్సిన మెగా వ్యాక్సినేషన  డ్రైవ్‌ను రద్దు చేసినట్లు సమాచారం. 17వ తేదీ నుంచి జరగాల్సిన వార్డు సభ్యుల శిక్షణ సైతం రద్దు చేసినట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో త్వరగా కౌంటింగ్‌ తంతు ముగించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తున్నట్లు సమాచారం. దీంతోనే వ్యాక్సినేషన, ఇతర కార్యక్రమాలను సైతం రద్దు చేసినట్లు సమాచారం.