Abn logo
Sep 12 2021 @ 00:39AM

సర్దుబాటయ్యేదెన్నడు.. సఖ్యత కుదిర్చేదెవరు..?

  • టీడీపీ నేతల్లో ఆధిపత్య పోరు 
  • అంతర్మథనంలో కార్యకర్తలు

అనంతపురం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): టీడీపీ నే తల మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తలు అంతర్మథనం చెం దుతున్నారు. నేతల మధ్య వర్గ విభేదాలు ముదిరిపోతున్నా యి. ఆధిపత్యం కోసం నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా అం టూ పోటీపడుతుండటంతో కార్యకర్తలు ఎటువైపు వెళ్లా లో తేల్చుకోలేని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరి ప క్షం వెళ్తే ఏ ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ ఆధిపత్య పోరు సద్దుమణిగేదెన్నడు, వారి మధ్య సఖ్యత కుదిర్చేదెవరన్న ప్రశ్న కార్యకర్తలను వేధిస్తోంది. జిల్లాలో తాజాగా ఆ పార్టీలో సాగుతున్న ఘటనలు కార్యకర్తల్లో ఆందోళన రేపుతున్నాయి. అధికార పా ర్టీ నేతలు సాగిస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలు, భూకబ్జాలతోపాటు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన తరుణంలో ఆధిపత్యం కోసం పాకులాడటం కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. నేతలంతా ఒకేమాట, ఒకేతాటిపై నడిచి ఉంటే జిల్లాలో మెజార్టీ సీట్లు టీడీపీవేనని కార్యకర్తలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. దీన్నిబట్టి నేతల మధ్య విభేదాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నా పాఠాలు నేర్వని పరిస్థితిలో నే తలుంటే... కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారెవరని ఆ వర్గా లు ప్రశ్నిస్తున్నాయి. అధికారంలో ఉన్నపుడు మంత్రులు సై తం ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉండేది. మరెందుకోగానీ ప్రతిపక్షంలో ఉన్నామన్న సంగతిని మరిచిన నాయకులు ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడాన్ని కార్యకర్తలు తప్పుబడుతున్నారు. దీంతోనే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పట్టుకోల్పోతోందన్న విమర్శలు లేకపోలేదు. గ్రామస్థాయిలోనూ కార్యకర్తల్లో అనైక్యతకు నేతల మధ్య విభేదాలే ప్రధాన కారణమన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఆ నియోజకవర్గాల్లోనే నేతల మధ్య వర్గపోరు...

జిల్లాలో ప్రధానంగా అనంతపురం పార్లమెంటు పరిధిలోని కళ్యాణదుర్గం, శింగనమల, గుంతకల్లు, అనంతపురం అర్బన నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ, ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఒకే పార్టీలో ఉన్నా... వేరు కుంపటి పెట్టినట్లు పా ర్టీ కార్యక్రమాలు మొదలుకుని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఆదినుంచీ అనంతపురం అర్బన నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఇనచార్జ్‌ జేసీ పవనరెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఆ ఇద్దరి నేతల వర్గపోరు నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విడిపోయారు. దీంతో అనైక్యతకు దారితీసింది. ఏ కార్యక్రమమైనా రెండు వర్గాలు వేర్వేరుగానే చేస్తున్నాయి. దీంతో గత మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. నేతల మధ్య సఖ్యత ఉండుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొ నసాగితే రానున్న ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో నని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

- కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, ప్రస్తుత నియోజకవర్గ ఇనచార్జ్‌ మాదినేని ఉమామహేశ్వరనాయుడు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈ ఇరువురు పరస్పరం విమర్శలకు వెనకాడలేదు. రెండు వర్గాలుగా చీలిపోవడంతో కార్యకర్తలు కూడా నేతలనే అనుసరించాల్సి వచ్చింది. చివరికి బాహాబాహికి దిగే స్థాయికి చేరారు. తాజా గా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు హంద్రీనీవా కాలువ పర్యటన నేపథ్యంలో ఒకవర్గంపై మరోవర్గం కయ్యానికి కా లుదువ్వే పరిస్థితులు ఎదురయ్యాయి. మాదినేని వర్గంపై ఉన్నం వర్గీయులు చేయిచేసుకునే దాకా వెళ్లారు.

- గుంతకల్లు నియోజకవర్గ ఇనచార్జ్‌ జితేంద్రగౌడ్‌, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌ మధ్య విభేదాలు నె లకొన్నాయి. పార్టీ కార్యక్రమాలు సైతం వేరు కుంపటిగానే కొ నసాగుతున్నాయి.

- శింగనమల నియోజకవర్గంలోనూ నియోజకవర్గ ఇనచార్జ్‌ బండారు శ్రావణిశ్రీతో కొన్ని మండలాల ముఖ్య నాయకు లు విభేదిస్తున్నారు. ఇక్కడా వర్గాలకు ఆ పార్టీ మండ నే తలే నాయకత్వం వహిస్తుండటంతో కార్యకర్తలు వర్గాలుగా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


హిందూపురం పార్లమెంటు పరిధిలో విబేధాలు ఒకట్రెండు నియోజకవర్గాలకే పరిమితమయ్యాయి..

- మడకశిర నియోజకవర్గంలో అధికారంలో చట్టా పట్టాలేసుకు తిరిగిన గుండుమల తిప్పేస్వామి, ఈరన్న మధ్య ప్రతిపక్షంలోకి రాగానే విభేదాలు పొడచూపాయి. ఎవరికి వారు గా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వేరుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

- పెనుకొండ నియోజకవర్గంలో ఆ పార్లమెంటు విభాగ అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఎ డమొహం పెడమొహంగానే ఉంటున్నారు. వారి మధ్య స ఖ్యత కుదర్చడానికి కొందరు నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వర్గాలుగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా జిల్లాలో ప్రధాన ప్ర తిపక్షమైన తెలుగుదేశం పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు, వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. కొందరు నేతల నియంతృత్వ ధోరణే వర్గపోరుకు ఆజ్యం పోస్తోందన్న విమర్శలు ఆ పార్టీ వర్గాల నుంచే వెల్లువెత్తుతున్నాయి.

కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేరా?

వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది. వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ నుంచి ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు చం ద్రబాబునాయుడు వరకూ టీడీపీకి కార్యకర్తలే వెన్నుదన్ను గా నిలుస్తున్నారని చెబుతున్నారు. అలాంటి కార్యకర్తల్లో ఆ త్మస్థైర్యం నింపేలా నేతల పనితీరు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టే ఏ నిరసనకైనా... ఏ ఆందోళనకైనా కార్యకర్తలే ముందుంటారు. అలాంటి కార్యకర్తలు లేని ఏ కార్యక్రమమైనా విజయవంతమైన దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నపుడు అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఆయా నియోజకవర్గాల బాధ్యులపై ఉందనడంలో సందేహం లేదు. అప్పుడే కార్యకర్తల్లో జోష్‌ నింపినవారవుతారు. శనివారం కమ్మభవనలో రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై నిర్వహించిన సదస్సు లో తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కార్యకర్తల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. గత రెండున్నరేళ్లలో ఏనాడైనా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారా.. అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కార్యకర్తల కారణంగానే నాయకులుగా ఎదిగామనీ, ఈ విషయాన్ని విస్మరించొద్దని ఆయన చెప్పిన మాటలు కార్యకర్తలను ఆలోచనలోకి నె ట్టాయి. కార్యకర్తలను బలోపేతం చేయడం ద్వారానే పార్టీ మరింత అభివృద్ధి చెందుతుందన్నది నిర్వివాదాంశం. ఆ ది శగా టీడీపీ నేతలు పయనించాలని ఆ పార్టీ కార్యకర్తలు కో రుకుంటున్నారు.