Abn logo
Sep 15 2021 @ 01:25AM

ముందుకు సాగని ఈకేవైసీ ప్రక్రియ

ఈ క్రాపింగ్‌కు సర్వర్‌ దెబ్బ! 

ముందుకు సాగని ఈకేవైసీ ప్రక్రియ 

యాప్‌ మార్పులతో సాంకేతిక సమస్యలు  

పొలాల్లో పంట ఫొటోలు తీసేదెప్పుడో? 

ఈనెలాఖరుతో ఖరీఫ్‌ ముగింపు.. స్పందించని ప్రభుత్వం 

పంట కోత తర్వాత ఈ క్రాప్‌ ఎలా చేస్తారన్న ఆందోళన 

అనంతపురం వ్యవసాయం, సెప్టెంబరు 14: ఖరీఫ్‌ సీజనలో ఈ క్రాపింగ్‌కు సర్వర్‌ సమస్య సతాయి స్తోంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సర్వర్‌ పూర్తిగా పనిచేయడం లేదు. దీంతో రైతుల నుంచి  వేలిముద్రలు తీసుకునేందుకు (ఈ కేవైసీ) వ్యవసాయ సిబ్బం ది నానా అవస్థలు పడుతున్నారు. పనులు వదులుకొని రైతు భరోసా కేంద్రాల వద్దకు పలుమార్లు వెళ్లలేక రైతులు ఇబ్బందులు పడు తున్నారు. సర్వర్‌ సమస్యతో ఈకేవైసీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. యాప్‌ల మార్పుతో క్షేత్ర స్థాయిలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రకాల యాప్‌లను మార్చింది. గతేడాది ఈ-కర్షక్‌ యాప్‌లో పంటల నమోదు చే యించుకున్నారు. ఈ ఏడాది  పం ట ల నమోదు కోసం యూడీపీ (యూనిక్‌ డి జి టల్‌ ప్లాట్‌ఫాం) యాప్‌ను అమల్లోకి తెచ్చారు. ఏడాదికో మారు కొత్త యాప్‌లు తెరపైకి తెస్తుండటంతో కొత్త కొత్త సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరించడం లేదు. దీంతో వ్యవసాయ సిబ్బందితోపాటు రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. 


ముందుకు సాగని ఈకేవైసీ ప్రక్రియ

సర్వర్‌ సమస్యతో ఈకేవైసీ ప్రక్రి య ముందుకు సాగడం లేదు. ఈ ఏడా ది జూలై ఆఖరు వారం నుంచి రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ర్టేషన ప్రక్రియ మొదలు పెట్టారు. రైతు పేరు, సర్వే నెంబర్‌ వారిగా వివరాలు నమోదు చే సుకున్నారు. ఆ తర్వాత రైతులతో ఈకేవైసీ వేయించుకోవడం ఆరంభించారు. గత నెల 15వ తేదీలోగా రిజిస్ర్టేషన, ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాఽధికారులు ఆదేశించారు. సర్వర్‌ సమస్యతో ఈకేవైసీ ప్రక్రియకు ఆటం కం ఏర్పడింది. ఈనెల 10వ తేదీ వరకు గడువు పొడిగించారు. అయినప్పటికీ ఇప్పటి దాకా ఆశించిన స్థాయిలో రైతులతో వేలిముద్రలు వేయించలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా 4.75 లక్షల మంది రైతులతో వ్యవసాయం, ఉద్యాన పంటలు కలుపుకొని 16.19 లక్షల ఎకరాల్లో రిజిస్ర్టేషన ప్రక్రియ పూర్తి చేశారు. అయితే ఇప్పటి దాకా 92 వేల మంది రైతులతో మాత్రమే వేలిముద్రలు వేయించారు. మిగిలిన రైతులతో ఎప్పటిలోగా ఈకేవైసీ పూర్తి చేస్తారో తెలియని అయోమయం నెలకొంది. సర్వర్‌ సమస్యతో రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ఉదయం, సాయంత్రం వేళల్లో రైతులతో వేలిముద్రలు వేయించుకుంటున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో వలంటీర్లతో వేలిముద్రలు వేయిస్తున్నారు. అయినప్పటికీ స ర్వర్‌ ఎప్పుడు ఉంటుందో..? ఎప్పుడు పోతుందో తెలియకపోవడంతో వ్యవసాయ సిబ్బందితోపాటు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. 


పొలాల్లో పంట నమోదు చేసేదెప్పుడో.?

గత ఏడాది ఇదే సమయానికి ఆశించిన స్థాయిలో ఈ క్రాప్‌ నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటి దాకా ఈ క్రా పింగ్‌ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వక పోవడం గమనార్హం. ఈ కర్షక్‌ యాప్‌లో రైతుల పేర్లు రిజిస్ర్టేషన చేసుకొని ఒకేసారి పొలాల్లోకి వెళ్లి రైతులను నిలబెట్టి ఫొటోలు తీసుకొని యాప్‌లో అప్‌లోడ్‌ చేసేవారు. ఆ తర్వాత రైతు భరోసా కేంద్రాల్లో ఈకేవైసీ వేయించారు. అప్పట్లో రైతులు ఎక్కడి నుంచైనా వేలిముద్రలు వేసే స దుపాయం ఉండేది. ఈ ఏడాది కొత్త యాప్‌ అమలుతో సమస్యలు తలెత్తాయి. కొత్త యాప్‌లో మూడు దశల్లో పనులు చేయాలని షరతు పెట్టారు. తొలుత రైతుల వివరాలతో రిజిస్ర్టేషన చేసుకోవడం, ఆ తర్వాత ఈకేవైసీ, పొ లాల్లోకి వెళ్లి ఫొటో తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెలాఖరుతో ఖరీఫ్‌ సీజన ముగియనుంది. అయినప్పటికీ ఇప్ప టిదాకా పొలాల్లో పంట ఫొటో తీసుకునేందుకు అనుమతులు ఇవ్వకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ ఏడాది జూనలో వేసిన వేరుశనగ పంట వారం రోజుల్లో కోతకు రానుంది. ఆ తర్వాత వేసిన పంటలు కూడా త్వరలో కోతకు రానున్నాయి. పంట కోత పూర్తైన తర్వాత అనుమతులు వస్తే తాము ఎలా పంట ఫొటో లు తీసుకో వాలంటూ వ్యవసాయ సిబ్బంది అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సారి సీజన ముగిసే సమయంలో ఆలస్యంగా ఫొటో తీసుకునేందుకు అనుమతులు ఇస్తే తక్కువ సమయంలో క్షేత్ర స్థాయిలో ఎలా ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు సకాలంలో ఈ క్రాపింగ్‌ పూర్తైతేనే పంట నష్టపరిహారం, బీమాతోపాటు ఇతర రకాల సంక్షేమ పథకాలు రైతులకు వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఈ క్రాపింగ్‌లో తీవ్ర జాప్యం జరగడంతో ఏం చేయాలో తోచని సందిగ్ధంలో వ్యవసాయ యంత్రాంగం సతమతమవుతోంది. మరోవైపు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  


అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం: చంద్రా నాయక్‌, జేడీఏ 

ఈ క్రాపింగ్‌ చేసేందుకు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. సర్వర్‌ సమస్యతో ఈకేవైసీ ప్రక్రియ ముం దుకు సాగడం లేదు. అయినా సర్వర్‌ పనిచేసే సమయాల్లో రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బందిని అందుబాటులో ఉం చుతూ వేలిముద్రలు వేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. సర్వర్‌ సమస్యను ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకువెళ్లాం. పొలాలకు వెళ్లి పంట ఫొటో తీసేందుకు త్వరలో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. రాగానే ఈ క్రాపింగ్‌ను వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. 


ఈ-క్రాపింగ్‌ ఇంకా చేయలేదు 

ఈ ఏడాది జూలైలో రెండు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. రైతు భరోసా కేంద్రంలో పట్టాదారుపుస్తకం, ఆధార్‌ జిరాక్స్‌ ఇచ్చా. నా పేరుతో రిజిస్ర్టేషన చేశామన్నారు. సర్వర్‌ పనిచేయకపోవడంతో ఇంకా నాతో వేలిముద్ర వేయించుకోలేదు. ఇప్పటి దాకా నా పొలానికి వచ్చి ఎవరూ పంట ఫొటో తీసుకోలేదు. ఇదేమని రైతు భరోసా కేంద్రంలో అడిగితే ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదంటున్నారు. గత ఏడాది త్వరగా పొలాల్లోకి వచ్చి ఈ క్రా పింగ్‌ చేసుకున్నారు. ఈ సారి ఎందుకో ఆలస్యం  చేస్తున్నారు.  పంట కోతకు ముందే ఫొటోలు తీసుకుంటే బాగుంటుంది. పంట కోత తర్వాత ఎలా ఫొటోలు తీసుకుంటారో ఏమో. 

- రైతు లింగమయ్య, రాప్తాడు