Advertisement
Advertisement
Abn logo
Advertisement

సినిమా స్టైల్‌లో ఏటీఎం ట్యాపింగ్... చివరికి ఏం జరిగిందంటే...

హైదరాబాద్: ఏటీఎం ట్యాపింగ్ సీన్లు సినిమాలకే పరిమితం అనుకుంటే పొరపాటు.. నిజ జీవితంలోనూ దొంగలు సులువుగా ఏటీఎంలోకి చొరబడి మంచినీళ్లు తాగినంత ఈజీగా పని చేసుకుని వెళ్లిపోతున్నారు. సరిగ్గా సినిమా స్టైల్లో ఏటీఎం ట్యాపింగ్ క్రైమ్ ఒకటి హైదరాబాద్‌లో జరిగింది. బ్యాంక్ అధికారులకు కూడా అనుమానం రాకుండా లక్షల రూపాయలు కొట్టేశారు. చివరికి పోలీసులకు చిక్కడంతో కటకటాలపాలయ్యారు.


ఏటీఎంలు ట్యాప్ చేసి డబ్బులు నొక్కేయడంలో ఆరితేరిన ఓ ముఠాలో ఐదుగురిని చార్మినార్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. నిందితులు హరియాణా మేవత్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. చార్మినార్ ప్రాంతంలోని ఓ ఎస్‌బీఐ ఏటీఎంలో రూ. 53వేలు విత్ డ్రా అయ్యాయి. బ్యాంక్ మూలధనంలో తేడా రావడంతో అప్రమత్తమైన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలింది. నల్లకుంట, మీర్ పేట్, హయత్ నగర్ ప్రాంతాల్లో ఇలాగే జరగడంతో సవాల్‌గా తీసుకున్న పోలీసులు ఈ కేసును చేధించారు... మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Advertisement
Advertisement