Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్‌రెడ్డి ఏలుబడిలో బీసీలకు వంచనే: అచ్చెన్నాయుడు

అమరావతి: జగన్‌రెడ్డి ఏలుబడిలో బీసీలకు వంచనే అని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక సంస్థల్లో 10శాతం రిజర్వేషన్ల కోతతో 16,800 మందికి పదవులు దూరం చేశారని మండిపడ్డారు. బీసీ జనగణన కోరుతూ 2014లోనే టీడీపీ తీర్మానం తీసుకుందని గుర్తుచేశారు. మళ్లీ తీర్మానం పేరుతో బీసీలను జగన్‌ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ చుట్టూ కేసుల కోసం తిరగడం తప్ప బీసీ గణనపై ఒత్తిడి ఎందుకు చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. బీసీ సంక్షేమంపై వైసీపీకి ధైర్యముంటే చర్చకు రావాలన్నారు. 


Advertisement
Advertisement