Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ గెలుపుపై అచ్చెన్నాయుడు సవాల్

అమరావతి: వైసీపీ గెలుపుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో వైసీపీ గెలిచిన గెలుపు ఒక గెలుపా? అని ప్రశ్నించారు. మంత్రులు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. దొంగ ఓట్లతో గెలిచి మంత్రులు బొకేలు ఇచ్చు కోవడం దారుణమన్నారు. టీడీపీ కార్యకర్తలు చేసిన పోరాటాన్ని అభినందిస్తున్నామని చెప్పారు. ఈ రోజు వైసీపీ విజయాలను డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఇవ్వాలన్నారు. డీజీపీ లేకపోతే వైసీపీ గెలిచేది కాదన్నారు. ఈ ఫలితాలను చూసి టీడీపీ భయపడటం లేదని, సంతోషంగా ఉన్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు పని అయిపోలేదని, కొద్దిరోజుల్లో వైసీపీ నేతలకు చంద్రబాబు అసలు సినిమా చూపిస్తారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 


Advertisement
Advertisement