Abn logo
Oct 21 2021 @ 01:39AM

ఆరు పదుల వయసులో..

చెన్నై నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న వాసుదేవన్‌ 


తిరుమల, అక్టోబరు20 (ఆంధ్రజ్యోతి): ఆరు పదుల వయసులో చెన్నై నుంచి ఓ భక్తుడు కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఇలా 25 ఏళ్లుగా ఆయన కాలినడకన తిరుమల వస్తుండటం గమనార్హం. చెన్నైకి సమీపంలోని పెరంబూరుకు చెందిన కె.వాసుదేవన్‌(69) వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్‌. ప్రపంచ మానవాళి సుఖసంతోషాలతో ఉండాలనే ఆకాంక్షతో 25 ఏళ్లుగా పెరంబూరు నుంచి పాదయాత్రగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం పెరంబూరు నుంచి పాదయాత్రను ప్రారంభించి దాదాపు 130 కిలోమీటర్లు నడిచి బుధవారం రాత్రి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఈ వయసులోనూ తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడానికి స్వామి ఆశీస్సులే కారణమన్నారు. పాదయాత్రలోనూ తనకు ఎలాంటి అలసట కనిపించదన్నారు.