Aug 1 2021 @ 15:19PM

‘హిడింబ‌’గా అశ్విన్ బాబు

హీరో అశ్విన్ బాబు లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘హిడింబ‌’. అనీల్ కృష్ణ క‌న్నెగంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్‌(ఎస్‌.వి.కె.సినిమాస్‌) బ్యాన‌ర్‌పై గంగ‌ప‌ట్నం శ్రీధ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్విన్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో టైటిల్‌ను‘హిడింబ‌’గా తెలియ‌జేశారు. పోస్ట‌ర్‌ను చూస్తే .. అశ్విన్ త‌ల‌పై ర‌క్త‌పు చుక్క‌లు.. చేతిలో ఇనుప చువ్వ‌ను ప‌ట్టుకుని మెలి తిప్పిన మీసాల‌తో యుద్ధానికి సిద్ధం అనేలా యాక్ష‌న్ ప్యాక్డ్ లుక్ క‌నిపిస్తుంది. పోస్ట‌ర్ చూస్తుంటే అశ్విన్ బాబు మేకోవ‌ర్ క‌నిపిస్తుంది. సినిమా ఇప్ప‌టికే యాబై శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. నందితా శ్వేత హీరోయిన్‌గా న‌టిస్తుంది.