Abn logo
Sep 7 2020 @ 04:34AM

అధ్యక్షా..నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

జిల్లా సమస్యల ప్రస్తావనకు ఎమ్మెల్యేలు సిద్ధం

పరిష్కారానికి నోచుకుంటాయని 

ఆశిస్తున్న ఉమ్మడి జిల్లావాసులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ప్రజాసమస్యల పరిష్కార వేదికగా నిలిచే శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి కీలక అంశాలపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మెజార్టీ సమాయాన్ని వాటిపై చర్చించేందుకు కేటాయుంచాలనుకుంటోంది. గత బడ్జెట్‌ సమావేశాలను కరోనా వైరస్‌ వల్ల అర్ధాంతరంగా ముగించిన విషయం అందరికీ విధితమే. చర్చకు రాని అంశాలు, బిల్లులు, ఆమోదం పొందని వాటిపై ఈసారి సభలో ప్రవేశపెట్టనున్నారు. కరోనా వైరస్‌ నేప థ్యంలో కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎమ్మెల్యేలు తమ సమస్యలపై గళం వినిపించాలని కోరుకుంటున్నారు. కానీ.. కొంతమంది ఎమ్మెల్యేలకు అవకాశం లభించడంలేదు. దీంతో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని అనేక సమ స్యలు ప్రజలను వేధిస్తున్నాయి. రంగారెడ్డిజిల్లా చేవెళ్ల అసెంబ్లీ నియోజక వర్గంలో జీవో111 గుదిబండగా మారింది. 84 గ్రామాల్లో అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ఏళ్లతరబడి ఈ సమస్య ప్రజలను వేధిస్తోంది. ఎన్నికల ముందు ఈ జీవోను రద్దు చేస్తామని, లేదా సడలిస్తామని నేతలు ఇచ్చిన హామీలు నీటి మీద బుడగల్లా మారాయి.


జీవో111లో వెలసిన అక్రమ లేఅవుట్లను ఇటీవలే అధికారులు కూల్చివేశారు. ప్రతీ రూపాయి కూడబెట్టి ప్లాట్లు కొన్న అమాయకులు అవస్థలు పడుతున్నారు. ఎల్‌ఆర్‌ఎ్‌సను వర్తింప చేయాలని కోరుకుంటున్నారు. షాద్‌నగర్‌ నియోజకవర్గం చౌదరిగూడ మండలంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం జరిగితే తమ కష్టాలు తీరుతాయని ఎదురుచూస్తున్న రైతన్నలకు నిరాశే ఎదురవుతోంది. రిజర్వాయర్‌ను ఎన్నికల సమయంలో ప్రచార అస్త్రంగా ఉపయోగించుకున్నారే తప్ప నిర్మాణం కోసం అడుగు ముందుకు వేయడం లేదు. ప్రతిపక్షాల నిరసనలు, ఆందోళనలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం హామీలతో కాలయాపన చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. రాచకొండ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పాలన అను మతుల కోసం ఎదురు చూస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అమలు తీరుపై తీవ్ర అశ్రద్ధ నెలకొంది. మిషన్‌ భగీరథ పథకం షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో అమలుకు నోచుకోవడం లేదు.


పనులు నత్తనడ కన సాగుతున్నాయి. రాఘవ కన్‌స్ట్రక్షన్‌ నాలుగేళ్ల క్రితం పనులను అర్థాంత రంగా నిలిపివేసింది. ఈ విషయంలో ఎమ్మెల్యే సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మేధా సంస్థ పనుల బాధ్యత తీసుకుంది. పనులు నత్తనడకన సాగుతున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయి. అనంతగిరికొండలను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని పాలకులు ఇచ్చిన హామీ నెరవేరలేదు. వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో విలీనం చేయాలన్న అంశం నేటికీ నెరవేరలేదు. కొత్త జోన్ల ఏర్పాటు సమయంలో వికారాబాద్‌ జిల్లాను జోగులాంబజోన్‌లో చేర్చారు. అయితే తమను చార్మినార్‌ మల్టీ జోన్‌లో చేర్చాలంటూ యువత ఆందోళనలు చేశారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం వికారరాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో చేర్చాల్సి ఉంది. కానీ.. నేటికి అమాత్యుని హామీ కార్యరూపం దాల్చలేదు. మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లో డంపింగ్‌యార్డు సమస్య తీరడం లేదు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎన్నో సమస్యలు తిష్ఠవేశాయి. ఈనేపథ్యంలో ప్రజల ఆకాంక్షలు, అవసరాలను గుర్తించి అసెంబ్లీ సమావేశాల్లో తమ వాణి వినిపిస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 


111జీవో పై మాట్లాడతా..

జీవో 111పై అసెంబీల్లో మాట్లా డతా. ఈ జీవో పరిధిలో ప్లాట్లు కొని పరేషాన్‌ అవుతున్న వారికి ఎల్‌ ఆర్‌ఎస్‌ అవకాశం కల్పించాలని ఇప్ప టికే కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాను. ఈ సమావేశంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై గళం విప్పుతా.            - కాలె యాదయ్య, ఎమ్మెల్యే చేవెళ్ల రాచకొండ ఎత్తిపోతల అనుమతి కోరతాం..రాచకొండ ఎత్తిపోతల పథకానికి సంబంధించి డీపీఆర్‌ను తక్షణమే ఆమోదించి పరిపాలనా అనుమతులు కోరతాం. అలాగే ఇబ్రహీంపట్నం సీహెచ్‌ఎన్‌సీని 30 పడకల నుంచి వందపడకల స్థాయికి అప్‌ గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోర తాం. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న మంచాల మండలం రంగాపూర్‌ అబ్జర్వేటరీ స్థలంలో పీజీ కళాశాలతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫార్మా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రస్తావించనున్నాం. అబ్దుల్లాపూర్‌మెట్‌- ఘట్‌కేసర్‌ల మధ్య మూసీపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనేది అసెంబ్లీలో ప్రస్తావించనున్నాం.

- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే 


లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణంపై వాణి వినిపిస్తా..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోత లలో భాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వా యర్‌ నిర్మాణాన్ని త్వరగా ప్రారంభిం చాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. అలాగే షాద్‌నగర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం పనులు ఆగిపో యాయి. ఈ విషయం కూడా ప్రస్తా విస్తాను. అంతే కాకుండా షాద్‌నగర్‌ పట్టణంలోని కేశంపేట రోడ్డులో గల రైల్వేట్రాక్‌ వద్ద ఫ్లైఓవర్‌, చటాన్‌పల్లి రోడ్డులోని రైల్వేట్రాక్‌ వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రస్తావిస్తాను. ఈ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయితే వాహనదారుల ఇబ్బందులు తొలగిపోతాయి. 

- వై. అంజయ్యయాదవ్‌, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే


నియోజకవర్గ సమస్యలపై మాట్లాడతా..

ఆమనగల్లులో ప్రభుత్వ జూని యర్‌ కళాశాల భవన నిర్మాణం, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు, కేఎల్‌ఐడీ-82 కాల్వ పనుల పూర్తి, భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపు, ఆమనగల్లు ఆసుపత్రిస్థాయి పెంపు, పలుచోట్ల విద్యుత్‌ ఉప కేంద్రాల ఏర్పాటు తదితర విషయాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను.

- జైపాల్‌యాదవ్‌, కల్వకుర్తి  ఎమ్మెల్యే


నియోజకవర్గ సమస్యలపై చర్చిస్తా..

వికారాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా.. అసెంబ్లీ సమావేశాల్లో సమ స్యలపై చర్చిస్తా. ముఖ్యంగా అనం తగిరి పర్యాటక స్థలంగా అభివృద్ధి పరిచే అంశం ప్రభుత్వం దృష్టిలో ఉంది. బ్రిడ్జిల నిర్మాణం విషయం ఇదివరకే సీఎం దృష్టికి తీసుకెళ్లాను. ఆయుష్‌ ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుపై మరో సారి చర్చిస్తా. నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించుకోవడమే కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. సమావేశాల్లో మాట్లాడేందుకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

- మెతుకు ఆనంద్‌, ఎమ్మెల్యే వికారాబాద్‌ 


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ప్రస్తావిస్తా..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ప్రస్తావిస్తా.. సాధించి తీరుతాం. పరిగిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుపై మాట్లాడుతా. పరిగి నియోజకవర్గంలో నెలకొన్న సమ స్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తా..

- మహేష్‌రెడ్డి, ఎమ్మెల్యే పరిగి 


అధ్వానంగా మారిన రోడ్ల పరిస్థితిపై గళం విప్పుతా..

తాండూరులో అధ్వానంగా మారిన రోడ్ల పరిస్థితితో పాటు తాండూరుకు మంజూరైన మెడికల్‌ కళాశాల పారిశ్రామికవాడ గురించి, ఈఎస్‌ఐ డిస్పెన్సరీని 50 పడకల ఆస్పత్రిగా పెంపు, కోట్‌పల్లి ఇరి గేషన్‌ ప్రాజెక్టు ఆధునికీకరణ, భూత్పూర్‌- చించోలి నేషనల్‌ హైవే లింపు చేయడం గురించి అసెంబ్లీలో మాట్లాడతాను. తాండూరు జహీరాబాద్‌ రోడ్డు గురించి చర్చిస్తా. 

- పైలెట్‌ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్యే తాండూరు


ప్రజా సంక్షేమ పథకాలపై చర్చిస్తా

ప్రజా సంక్షేమ పథకాలపై అసెంబ్లీలో మాట్లాడుతా. పాల మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, జూనియర్‌ కళాశాలల ఏర్పాటు విషయమై మాట్లాడుతా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడుతా. 

- పి. నరేందర్‌రెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే 

Advertisement
Advertisement