Abn logo
Mar 11 2020 @ 04:30AM

ఫైనల్లో వికాస్‌, సిమ్రన్‌జిత్‌

 మేరీ, అమిత్‌, పూజ, లవ్లీనా, ఆశిష్‌కు కాంస్యాలు

ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌


 అమ్మాన్‌ (జోర్డాన్‌): భారత బాక్సర్లు వికాస్‌ క్రిషన్‌ (69 కిలోలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కిలోలు) ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. కాగా, భారీ అంచనాలు పెట్టుకున్న ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ మేరీ కోమ్‌ (51 కి), వరల్డ్‌ నెం.1 బాక్సర్‌ అమిత్‌ పంగల్‌ (52 కి), ఆశిష్‌ కుమార్‌ (75 కి), లవ్లీనా బోర్గొహైన్‌ (69 కి), పూజా రాణి (75 కి),  సెమీస్‌లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నారు. ఫైనల్‌ ఫోర్‌కు చేరడంతో ఈ ఏడుగురికి ఒలింపిక్స్‌ బెర్త్‌లు దక్కిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన సెమీస్‌లో వికాస్‌ 3-2తో అబ్లైఖాన్‌ హుస్పోవ్‌ (కజకిస్థాన్‌)ను ఓడించాడు. స్వర్ణ పోరులో ఇస్‌హైతి హుస్సేన్‌ (జోర్డాన్‌)తో వికాస్‌ తలపడనున్నాడు. కాగా, అమిత్‌ పంగల్‌ 2-3తో జియాన్‌గుయాన్‌ హు (చైనా) చేతిలో, ఆశిష్‌ 2-3తో ఉమిర్‌ మార్సియల్‌ (ఫిలిప్పీన్స్‌) చేతిలో పరాజయం పాలయ్యారు ఓడాడు. మహిళల సెమీస్‌లో సిమ్రన్‌జిత్‌.. షి యి వు (తైవాన్‌) బాక్సర్‌పై పోరాడి గెలిచింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న దిగ్గజం మేరీ కోమ్‌ 1-4తో చాంగ్‌  యువాన్‌ (చైనా) చేతిలో, లవ్లీనా బోర్గొహైన్‌ 0-5తో హాంగ్‌ గు (చైనా) చేతిలో, పూజా రాణి 0-5తో లి కియాన్‌ చేతిలో చిత్తయ్యారు. 

Advertisement

క్రీడాజ్యోతిమరిన్ని...

Advertisement
Advertisement