Abn logo
Oct 22 2021 @ 00:29AM

చంద్రబాబు దీక్షకు అశోక్‌రెడ్డి మద్దతు

చంద్రబాబు దీక్షలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి


గిద్దలూరు, అక్టోబరు 21 : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీక్షలో మాజీ ఎమ్మెల్యే ము త్తుముల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ పాలకుల ఉగ్రవాదంపై మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన దీక్షకు అశోక్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి వెళ్లి మద్దతు తెలిపారు. నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన 100 మంది ముఖ్యనాయకులతో  అశోక్‌రెడ్డి పోరుదీక్షకు తరలివెళ్లారు. ఈసందర్భంగా  అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా వ్యవహరించిన వైసీపీ కార్యకర్తల తీరుకు నిరసనగా చంద్రబాబు దీక్ష చేపట్టారని పేర్కొన్నారు. కార్యాలయాలపై, నాయకులపై, కార్యకర్తలపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తే దాడులు చేస్తారా అంటూ నిలదీశా రు. కార్యక్రమంలో టీడీపీ పట్టణశాఖ అధ్యక్షుడు సయ్యద్‌ షాన్షావలి, రాచర్ల, కం భం మండలశాఖల అధ్యక్షులు కె.యోగానంద్‌, తోటా శ్రీనివాసులు, టీడీపీ నాయకులు గోపాల్‌రెడ్డి, మహబూబ్‌బాషా,  కేతం శ్రీను, తోటా శ్రీనివాసులు, దూదేకుల దస్తగిరి  పాల్గొన్నారు. 

యర్రమోతు మద్దతు

పొదిలి : టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడులను ఖండిస్తూ మా జీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు అమరావ తిలో చేపట్టిన దీక్షలో పొదిలి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ యర్రమోతు శ్రీనివాసులు పాల్గొ న్నారు. చంద్రబాబును కలిసి దీక్షకు మద్దతు పలికారు. వైసీపీ దాడులను ఆయన ఖండించారు. చంద్రబాబు దీక్షకు ప్రజలు మద్దతుగా ఉండాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.