Oct 14 2021 @ 12:34PM

Aryan Khan ను విచారణలో NCB డైరెక్టర్ కొట్టాడా..? నువ్వు ఈ పని ముందే చేసి ఉండాలంటూ షారూఖ్‌కు హితవు పలికాడా..?

డ్రగ్స్ కేసులో ఈ నెల రెండో తేదీన అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ గురించి ప్రతిరోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఆ కేసులో మరో ఏడుగురు అరెస్ట్ అయినా.. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కొడుకు కాబట్టి ఆర్యన్‌ అందరికీ టార్గెట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆర్యన్ జైలు జీవితం గురించి రోజుకో వార్త పుట్టుకొస్తోంది. అలాంటి వాటిల్లో ఒకటి ఆర్యన్‌ను ఎన్‌సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే కొట్టారనే వార్త. షారూక్ సమక్షంలోనే ఆర్యన్‌పై సమీర్ చేయి చేసుకున్నారని ఓ వార్త పుట్టుకొచ్చింది. 


ఆర్యన్ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు సమీర్‌కు షారూక్ ఫోన్ చేశారని, ఆ సమయంలో ఆర్యన్‌ను సమీర్ కొట్టారని, నువ్వు ఈ పని ముందే చేసి ఉండాలంటూ షారూఖ్‌కు హితవు పలికారనే వార్త వైరల్ అయింది. అయితే అది ఒట్టి పుకారు మాత్రమేనని తేలింది. ఎందుకంటే విచారణ‌లో ఆర్యన్‌పై ఎలాంటి భౌతిక చర్యలకూ పాల్పడకూడదని న్యాయమూర్తి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆర్యన్‌ను కొట్టి ఉంటే అతడి తరఫు న్యాయవాది కోర్టులో కచ్చితంగా చెప్పేవాడు. దాంతో ఎన్‌సీబీ ఆత్మరక్షణలో పడిపోయేది. అలాంటివేమీ జరగలేదు కాబట్టి ఆర్యన్‌ను సమీర్ కొట్టారనేది కేవలం గాసిప్ మాత్రమేనని స్పష్టమవుతోంది. 

Bollywoodమరిన్ని...