Oct 15 2021 @ 17:33PM

జైలు నుంచే తల్లికి ఫోన్.. వెక్కి వెక్కి ఏడ్చిన Aryan Khan

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకుని ప్రస్తుతం ఆర్థుర్ రోడ్డులోని జైలులో ఉన్నాడు. ఎన్సీబీ అధికారులు ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపుగా 20 మందిని అరెస్టు చేశారు. జైలు నుంచే తన తల్లిదండ్రులకు ఆర్యన్ వీడియో కాల్ చేసి మాట్లాడినట్టు సీనియర్ అధికారులు తెలుపుతున్నారు. 


కరోనా ఇప్పటికి కూడా తగ్గక‌పోవడంతో జైలు అధికారులు ఎవరిని కూడా ప్రత్యక్షంగా కలుసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు.  జైలులోని వారు నెలలో రెండు లేదా మూడు సార్లు  వీడియోకాల్ చేసుకునేందుకు అవకాశమిస్తున్నారు. ఆర్యన్  ఈ అవకాశాన్ని వినియోగించుకుని షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌లకు వీడియోకాల్ చేసి దాదాపుగా 10నిమిషాలు మాట్లాడారు. అతడు ఫోన్ మాట్లాడుతున్నసేపు వెక్కివెక్కి ఏడ్చాడని జైలు అధికారులు తెలుపుతున్నారు. 


డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు దాదాపుగా 20మందిని అరెస్టు చేశారు. అనంతరం అతడిని  జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. కొద్దిరోజుల తర్వాత అతడు బెయిల్‌ను కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. అక్టోబర్ 20వ తేదీన ఆ కేసు విచారణకు రానుందని అధికారులు తెలుపుతున్నారు. ఎన్సీబీ అధికారులు అక్టోబర్ 3న రేవ్ పార్టీ జరుగుతున్న క్రూయిజ్‌షిప్‌పై దాడి చేసి ఆర్యన్‌ను అరెస్టు చేశారు. క్రూయిజ్ షిప్ నుంచి 13గ్రాముల కొకైన్, 21గ్రాముల చరస్ లతో సహా దాదాపుగా 1.3లక్షల నగదును సీజ్ చేశారు. 


క్రూయిజ్ షిప్‌పై పార్టీ జరిగిన సమయంలో 1000మందికి పైగా ఉండగా కేవలం కొంత మందినే అరెస్టు చేయడంతో ఎన్సీబీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై బాలీవుడ్ సెలెబ్రిటీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్యన్‌కు ఇప్పటికే  హృతిక్ రోషన్, రవీనా టండన్, సోమీ అలీ, సునీల్ శెట్టి తదితరులు తమ మద్దతును తెలిపారు.


Bollywoodమరిన్ని...