Abn logo
Oct 24 2020 @ 14:06PM

వ్యాక్సిన్ పొందడం అందరి హక్కు : కేజ్రీవాల్

Kaakateeya

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ దేశంలోని ప్రజలందరికీ దక్కాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ పొందే హక్కు అందరికీ ఉందని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇలా వ్యాక్సిన్ పై కేజ్రీవాల్ మాట్లాడటం ఇది రెండోసారి. ‘‘బీజేపీకి ఓటు వేయని వారికి వ్యాక్సిన్ దక్కదా?’’ అని గతంలో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు చేశారు. బిహార్ మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ... ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే బిహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ ప్రకటించింది.

Advertisement
Advertisement