Abn logo
Mar 6 2021 @ 20:02PM

నియామకాలు ఎక్కడున్నాయి: అరుణ

మహబూబ్‌నగర్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు ఎక్కడ ఉన్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే అనేక అవకాశాలు వస్తాయని చెప్పిన టీఆర్‌ఎస్ నేతలు వాటి సంగతి ఏమైందో చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రంలోనే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారని, అవి ఎక్కడ ఉన్నాయో, వాటితో ఎంతమంది లాభం పొందారో వివరాలు చెప్పాలని ఆమె పేర్కొన్నారు. ఉద్యమకారులను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని అరుణ ధ్వజమెత్తారు.