Abn logo
Oct 13 2021 @ 23:56PM

చోరీ కేసులో ఒకరి అరెస్టు


ఖిల్లా, అక్టోబరు 13 : జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌ బ్యాం క్‌ కాలనీలో ఇంటి తాళం ప గుల గొట్టి చోరీకి పాల్పడ్డ దొంగను రిమాండ్‌కు తరలిం చినట్లు నిజామాబాద్‌ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్లు తెలిపారు. జి ల్లా కేంద్రంలోని నాల్గోటౌన్‌లో బుధవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. బుధవారం ఉదయం బోర్గాం(పి) రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మాధవనగర్‌ వైపు నుంచి వస్తున్న ఆటోను ఆపే ప్రయత్నం చేయగా డ్రైవర్‌ పారిపోవడానికి యత్నించాడు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ జావిద్‌గా విచారణలో తేలిందన్నారు. తన స్నేహితుడు సోహైల్‌తో కలిసి 15 రోజుల క్రితం బ్యాంక్‌ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి వెళ్లి విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు నిందితుడు వివరించాడు. దొంగిలించిన సొత్తును మహారాష్ట్రలో అమ్మడానికి వెళ్తుండగా పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. నేరం అంగీకరించడంతో అతడివద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. సోహైల్‌ పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామన్నారు. జావిద్‌పై హైదరాబాద్‌ ఏడు కేసులు ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. నగర సీఐ సత్యనారాయణ, ఎస్సై సందీప్‌కుమార్‌, సిబ్బంది సుభాష్‌, వెంకట్రాంలను సీపీ కార్తికేయ అభినం దించారు. సమావేశంలో నగర సీఐ సత్యనారాయ ణ, ఎస్సై సందీప్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.