Abn logo
Sep 21 2021 @ 23:31PM

సచివాలయ మహిళా పోలీసుల పరీక్షలకు ఏర్పాట్లు

పరీక్షా ఏర్పాట్లపై సూచనలిస్తున్న కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి


 పరిశీలించిన డీఎస్పీ శివరామిరెడ్డి

 టెక్కలి రూరల్‌: గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులకు బుధ, గురువారాల్లో నిర్వహించనున్న డిపార్ట్‌మెంటల్‌ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం కాశీబుగ్గ డీఎస్పీ ఎం. శివరామిరెడ్డి పరిశీలించారు. కె.కొత్తూరు ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించనున్న పరీక్షల ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు. జిల్లాలోని టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల, రాజాం జీఎంఆర్‌ఐటీ, ఎచ్చెర్ల వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల, మునసబుపేట గాయత్రి కళాశాలల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఆయనతో పాటు టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య, ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వర రావు తదితరులున్నారు. 


చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి 

నరసన్నపేట: మహిళ పోలీసులు చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని  సీఐ తిరుపతి సూచించారు. మంగళవారం పోలీసు స్టేషన్‌లో సచివాలయ మహిళా పోలీసులకు డిపా ర్టుమెంటల్‌ మోడల్‌ పరీక్షను నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సత్యనారాయణ,  ఎస్‌ఐ-2 ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.