Abn logo
Sep 24 2021 @ 00:15AM

ఎంపీపీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

మాట్లాడుతున్న నాగమల్లేశ్వరరావు

సబ్బవరం, సెప్టెంబరు 23 : మండల పరిషత్‌ అధ్యక్షుని ఎన్నిక శుక్రవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రిసైడింగ్‌ అధికారి నాగమల్లేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వైసీపీ నుంచి 15 మంది, టీడీపీ నుంచి నలుగురు ఎంపీటీసీ అభ్యర్థులు గెలుపొందారని, శుక్రవారం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికకు సంబంధించి హాజరుకావాలని వారికి నోటీసులు ఇచ్చామన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కో-ఆప్షన్‌ మెంబర్‌ ఎన్నికకు సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఒంటి గంటకు చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేయిస్తామన్నారు. 3 గంటలకు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఏదైనా కారణం వల్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిలిచిపోతే 25న  నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ బి.రమేశ్‌నాయుడు పాల్గొన్నారు.