Abn logo
Oct 13 2021 @ 23:58PM

పకడ్బందీగా ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు


నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 13 : ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు. బుధవారం ఆయన చాంబర్‌లో ఈ పరీక్షలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కొవిడ్‌ నేపథ్యంలో గత విద్యాసంవత్సరంలో ఫస్టియర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనందున ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 25 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 71 కేంద్రాల్లో 18,697 మంది హాజరుకానున్నారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్‌ చేయాలన్నారు. పరీక్షాకేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలన్నారు. గ్రామీణాస్థాయి విద్యార్థులకు పరీక్షలకు హాజరుకావడానికి బస్సులు నడపాలన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ గిరిరాజ్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి రఘురాజ్‌, సంబంధిత అధికారులు హాజరయ్యారు.