Abn logo
Mar 6 2021 @ 01:17AM

మున్సిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించండి: ఎస్పీ

 పుట్టపర్తి, మార్చి5: మున్సిపల్‌ ఎన్నికలలో ఎలాంటి భద్రత లోపాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ బ్యాలెట్‌బాక్సుల భద్రపరచడానికి ఏర్పాటుచేసిన సా్ట్రంగ్‌ రూంలు, కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్‌, కౌంటింగ్‌ రోజున ఎలాంటి సంఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ రామకృష్ణయ్య, సీఐ వెంకటే్‌షనాయక్‌, ఎస్‌ఐ బాబ్జన ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement