Abn logo
May 22 2020 @ 20:24PM

15వేల ఏళ్లనాటి 60 జంతు కళేబరాలు లభ్యం.. శాస్త్రవేత్తలు షాక్

మెక్సికో సిటీ: దాదాపు 15000 ఏళ్ల నాటి భారీ ఏనుగు(మమోత్)లకు  సంబంధించిన 60 అవశేషాలు పురావస్తు శాస్త్రవేత్తలకు లభ్యమయ్యాయి. విమానాశ్రయం నిర్మాణపనులు కొనసాగుతున్న స్థలంలో ఈ స్థాయిలో జంతు అవశేషాలు లభించడంతో శాస్త్రవేత్తలు షాక్ అవుతున్నారు. ఇవి కొలంబియన్ మమూత్ జాతికి చెందినవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మమోత్‌ల అవశేషాలు మాత్రమే కాదని, ఆ కాలపు దున్నపోతులు(బైసన్), ఒంటెలు, గుర్రాల కళేబరాలు కూడా లభ్యమైనట్లు చెప్పారు. పలు మానవ సమాధులు, అందులో మానవ కళేబరాలు కూడా లభ్యమైనట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 


ఇదిలా ఉంటే మమోత్‌‌లను పట్టుకునేందుకు అప్పట్లో వినియోగించిన భారీ గుంతలు కూడా ఇటీవల ఇదే ప్రాంతంలో ఇటీవల లభ్యమయ్యాయి. స్థానిక గ్జాల్టోకాన్ సరస్సులో వీటిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Advertisement
Advertisement