Abn logo
Sep 17 2021 @ 01:57AM

రిమాండ్‌లోని ఏఆర్‌ ఏఎస్‌ఐ హఠాన్మరణం

మహ్మద్‌ బాషా మృతదేహం

చిత్తూరు సిటీ, సెప్టెంబరు 16: రిమాండ్‌లోని ఓ ఏఆర్‌ ఏఎస్‌ఐ హఠాన్మరణం చెందారు. ఇటీవల చిత్తూరులోని కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న వస్త్రదుకాణంలో జరిగిన దొంగతనానికి సంబంధించి ఏఆర్‌ ఏఎస్‌ఐ మహ్మద్‌బాషా, కానిస్టేబుల్‌ ఇంతియాజ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను జిల్లా జైలుకు రిమాండ్‌ నిమిత్తం పంపారు. కాగా.. బుధవారం సాయంత్రం మహ్మద్‌ బాషాకు సస్పెన్షన్‌ ఆర్డర్‌ రావడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో బాషా వాంతు లు చేసుకోవడంతో జైలు సిబ్బంది చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసు కొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం సుమారు ఎనిమిది గంటల సమయం లో మృతి చెందినట్లు జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు.