అమలాపురం రూరల్, ఫిబ్రవరి 25: ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులతో దేశానికి విదేశీ మారకద్రవ్యం లభిస్తుందని అమలాపురం సబ్‌కలెక్టర్ హిమాన్షుకౌశిక్ పేర్కొన్నారు. ఆక్వారంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో గురువారం ఏపీ ఆక్వాకల్చర్ విత్తన నియంత్రణ చట్టం, చేపల ఫీడ్ నియంత్రణచట్టంపై ఆక్వారైతులతో పాటు అనుబంధ సంస్థల ప్రతినిధులకు సబ్‌కలెక్టర్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్‌ఐఎఫ్‌టీ ప్రిన్సిపాల్ పి.కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై యాక్ట్‌లోని విధివిధానాలపై అవగాహన కల్పించారు. ఆక్వారంగ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలను తెలియచేశారు. మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు పీవీ సత్యనారాయణ, ఉపసంచాలకుడు ఎన శ్రీనివాసరావు, పలువురు అధికారులు, రైతులు పాల్గొన్నారు.