Abn logo
Mar 6 2021 @ 19:13PM

యూట్యూబ్‌లో సినిమా.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు దర్శకుడు ఫిర్యాదు

రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వీరాస్వామి. జి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఏప్రిల్ 28 ఏం జరిగింది?'. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. వినూత్నమైన కథతో ఎవరూ ఊహించలేని ట్విస్ట్‌లతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి రిజల్ట్‌నే అందుకుంది. ప్రేక్షక ఆదరాభిమానాలను గెలుచుకుని విజయవంతం ప్రదర్శితమవుతున్న ఈ చిత్రాన్ని పైరసీ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారని దర్శకుడు వీరాస్వామి. జి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఈ పని చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు.


దర్శకుడి నుంచి ఫిర్యాదు అందుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. పైరసీ చేసిన వారిని కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. చిత్రాన్ని పైరసీ చేసిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని దర్శకుడికి వారు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అజయ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటించిన ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్కా స్క్రీన్‌ప్లే అందించారు. 

Advertisement
Advertisement
Advertisement