Abn logo
Oct 22 2021 @ 21:50PM

వలంటీర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కోట, అక్టోబరు 22 : మండలంలోని  పలు పంచాయతీల్లో ఖాళీగా ఉన్న గ్రామ వలంటీర్‌ పోస్టులకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఎంపీడీవో భవాని కోరారు. గూడలి పంచా యతీలో 2,  (బీసీ జనరల్‌), చిట్టేడు పంచాయతీలో 1 (బీసీ జనరల్‌), కోట పంచాయతీలో 1 వలంటీర్‌ పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. 10వ తరగతి పాసైన, 18 నుంచి 35 ఏళ్ల లోపు  యువతీ, యువకులు ఈ నెల 24వ తేదీ తోగా స్థానిక మండల పరిషత్‌ కార్యాల యంలో దరఖాస్తులు సమర్పించాన్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 26, 27 తేదీల్లో ప్రకటిస్తామని వివరించారు.