Advertisement
Advertisement
Abn logo
Advertisement

జూలోని కోతులకు కొవిడ్ టీకా..!

కాలిఫోర్నియా: అమెరికాలోని శాన్ డియాగో జూలో ఉన్న తొమ్మిది కోతులకు(ఒరంగుటాన్లు, బోనోబోలు) అధికారులు శుక్రవారం కరోనా టీకా వేశారు. ఇలా మనుషులకు కాకుండా కొవిడ్ వ్యాక్సిన్‌ను జంతువులకు వేయడం ఇదే తొలిసారి అని కాలిఫోర్నియా జూ అధికారులు వెల్లడించారు. పశువైద్య ఔషధ సంస్థ జంతువుల కోసం ప్రత్యేకంగా సృష్టించిన ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను నాలుగు ఒరంగుటాన్లు, ఐదు బోనోబోలకు రెండు మోతాదుల చొప్పున ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఇదే జూలో ఈ ఏడాది జనవరిలో అక్కడ పనిచేసే సిబ్బంది ద్వారా ఎనిమిది గొరిల్లాలకు వైరస్ సోకిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలోనే అధికారులు జంతువుల కోసం ప్రత్యేకంగా టీకాను రూపొందించడం జరిగింది. తాజాగా ప్రయోగాత్మకంగా ఈ వ్యాక్సిన్‌ను జూలోని కోతులకు ఇచ్చారు. ఈ సందర్భంగా శాన్ డియాగో జూ వైల్డ్‌లైఫ్ అలయన్స్ దీనిని "సైన్స్ విజయం"గా అభివర్ణించింది. కాగా, ఈ టీకా ఇంతకుముందు పిల్లులు, శునకాలపై పరీక్షించబడింది. అక్కడ సానుకూల ఫలితాలు రావడంతో ఇప్పుడు కోతులపై దీన్ని ప్రయోగించినట్లు సమాచారం. 

Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement