Abn logo
Sep 18 2021 @ 03:04AM

దాడుల్లో అవే మూకలు..!

మొన్న ఉమాపై... నిన్న బాబు ఇంటిపై

విజయవాడ, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మెప్పు కోసం ప్రతిపక్ష నేతలను టార్గెట్‌ చేస్తూ వైసీపీ నేతలు, మూకలు తెగబడుతున్నాయి. ఇటీవల మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ జి.కొండూరు మండలం గడ్డమణుగు వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కారుపై తన అనుచరులతో దాడి చేయించిన విషయం విదితమే. ఆ ఘటనలో జోగి రమేశ్‌ తమ్ముడు రాము, అతని అనుచరులు లంకె అంకమోహన్‌రావు, పాలడుగు దుర్గా ప్రసాద్‌తోపాటు పలువురు ఉన్నారు. శుక్రవారం మాజీ సీఎం చంద్రబాబు ఇంటి మీదకు అదే వ్యక్తులతో జోగి దాడికి తెగబడ్డారు. పై రెండు చిత్రాల్లోనూ జోగి రాముని గమనించవచ్చు.


క్రైమ్ మరిన్ని...