ఇంటర్నెట్ డెస్క్: అసెంబ్లీలో సీఎం జగన్ నీతులు వల్లించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్శదర్శి నారా లోకేశ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. గజినీలా జగన్ నటించినా గూగుల్ మర్చిపోదుగా.. ఇలా కొడితే అలా వచ్చేసిందంటూ ఓ వీడియోను అప్లోడ్ చేశారు. గత అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై నారా లోకేశ్ తనదైన శైలిలో కౌంటర్ ఎటాక్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభలో చిందులు వేసి, అధికారం రాగానే నీతులు చెబితే ఎలా? అంటూ ప్రశ్నించారు. జగన్ రెడ్డిది నోరు కాదు అబద్ధాల పుట్ట అని ఎద్దేవా చేశారు.