Abn logo
Oct 27 2021 @ 15:18PM

రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

తూర్పుగోదావరి: రాజమండ్రిలో భారీగా గంజాయి పట్టుబడింది. రూ.2 కోట్ల విలువైన గంజాయిని మోతుగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారు. లారీ, పైలెట్‌గా ఉన్న కారును సీజ్ చేశారు. లారీలో కొబ్బరికాయల లోడ్‌ కింద నిందితులు గంజాయిని తరలిస్తున్నారు. నిందితుల నుంచి 3 సెల్‌ఫోన్లు, రూ.2వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.