Abn logo
Mar 7 2021 @ 11:31AM

హౌస్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

అమరావతి: హౌస్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. నామినేషన్ వేసిన అభ్యర్థులు కాకుండా వారి తరఫున వేరేవారు ఉపసంహరణ చేయడం చట్ట విరుద్ధమని దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాగే అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ చేశారు, వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ వీడియో ఫుటేజీని కోర్టుకు సమర్పించాలన్నారు. ఆర్వోలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 18 మంది అభ్యర్థులను తిరిగి పోటీ చేసే విధంగా కోర్టు ఆదేశాలివ్వాలని న్యాయవాది శ్రీనివాస్ పేర్కొన్నారు. 


మరోవైపు ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది అశ్విన్‌కుమార్ వాదనలు వినిపించారు. ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారని తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఆర్వోలను నివేదికలు కోరాం.. రేపటికి వస్తాయని తెలిపారు. ఈ పిటిషన్లకు విచారణ అర్హత లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. అభ్యర్థనలు ఏవైనా ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్‌లో చూసుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ విచారించడానికి వీల్లేదన్నారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. 

Advertisement
Advertisement
Advertisement