అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): శాసనసభలో విపక్ష నేత చంద్రబాబు శైలి చూస్తుంటే.. లేటు వయస్సులో చేసుకున్న పెళ్లిలా ఉందని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త కోణంలో కనిపించాలన్న ఆపేక్ష చంద్రబాబులో కనిపిస్తోందన్నారు. పాత విధానంలోనే ఉంటే ప్రజలు తనను నమ్మరని, కొత్త పంథాలో వెళితేనే గుర్తిస్తారన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందని అన్నారు.