అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లుగా ఎంపికైన వారికి మంత్రి సురేశ్ నియామక పత్రాలు అందజేశారు. డీఎస్సీ- 2018 నోటిఫికేషన్ ద్వారా సెలెక్టయిన అభ్యర్థులకు ఇప్పటివరకు కోర్టు కేసుల కారణంగా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. అయితే, ఇటీవల కోర్టులో కేసు కొట్టేయడంతో ఎంపికైన వారిలో 52 మందికి మంత్రి పత్రాలు అందజేశారు.