Abn logo
Dec 2 2020 @ 04:09AM

రైతులకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వాలు: సాకే

విశాఖపట్నం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): నరేంద్రమోదీ, జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ద్రోహం చేస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ విమర్శించారు. పార్టీ నగర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలపై పోలీసులు కిరాతకంగా విరుచుకుపడడం దారుణమన్నారు. రాష్ట్రాలన్నీ వ్యతిరేకిస్తున్నా వ్యవసాయ బిల్లులకు వ్యక్తిగత లబ్ధి కోసమే జగన్మోహన్‌రెడ్డి మద్దతిచ్చారని ఆరోపించారు. 

Advertisement
Advertisement
Advertisement