పులివెందుల, అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో అమూల్ సంస్థ ద్వారా పాలసేకరణ జరుగుతున్న గ్రామాల రైతులతో బుధవారం సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి మాట్లాడనున్నారు. కాగా, రాష్ట్రంలో అమూల్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్న నేపథ్యంలో అమూల్ ప్రతినిధులు సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.