Abn logo
Mar 26 2020 @ 09:21AM

ఇలా చేస్తే కరోనాను తరిమికొట్టొచ్చు..: అవంతి

విశాఖపట్నం : సామాజిక దూరం పాటిస్తేనే కరోనాను తరిమికొట్టొచ్చని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం నగరంలోని ఎంవీపీ కాలనీలో ఏఎస్ రాజా మైదానంలో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను మంత్రి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.


కఠిన చర్యలు..

కొనుగోలుదారులు లేనిపోని వదంతులు నమ్మొద్దు. సామాజిక దూరం పాటిస్తేనే కరోనాను తరిమికొట్టవచ్చు. పోలీసులకు, అధికారులకు ప్రజలు సహకరించాలి. విదేశాలు నుంచి వస్తున్న వారిని జల్లెడ పట్టి క్వారంటైన్ ఉంచుతున్నాం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైతు బజార్‌లు అందుబాటులో ఉంటాయి. నిత్యావసర వస్తువులను అధిక ధరలకు ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తప్పవు అని మంత్రి అవంతి హెచ్చరించారు.

Advertisement