Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేంద్రం నిధులతోనే ‘ఏపీ’ నడుస్తోంది: జీవీఎల్

విజయవాడ: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే.. రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలు భూకబ్జాల్లో ముందున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా కుదిపితే గానీ.. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగదన్నారు. మంత్రులు, శాసనసభ్యులను ఎక్కడికక్కడ నిలదీయాలని తెలిపారు. ఏఏ జిల్లాలకు ఎంతెంత నిధులు కేటాయిస్తున్నారో, వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై ప్రభుత్వ ప్రణాళికలు ఏంటో.. తదితర వివరాలకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై దాటవేత వేస్తున్నారని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం.. కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని జీవీఎల్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement