Abn logo
Mar 7 2021 @ 09:31AM

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్

అమరావతి: చిత్తూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. 18 డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు ఫోర్జరీతో విత్ డ్రా చేశారని పిటిషన్ వేశారు. హౌస్‌మోషన్ పిటిషన్‌ను 18 మంది టీడీపీ అభ్యర్థులు దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థుల తరఫున న్యాయవాది కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది తమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement