Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాటి ప్రభుత్వాల ఇళ్లపై జగన్ పెత్తనమేంటి?

అమరావతి/హైదరాబాద్: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలు మండిపడుతున్నారు. గతంలో ప్రభుత్వ హౌసింగ్‌ పథకం ద్వారా గ్రామాల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటే... వాళ్లు రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ప్రభుత్వం వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేసింది. రూ. 10 వేలు వసూలు చేసేందుకు వెళ్లిన వాలంటీర్‌పై ఆ గృహ యజమాని మండిపడ్డారు. తమకు పట్టా ఉందని, మళ్లీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న పట్టాకు మళ్లీ పట్టా ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే ‘నా పెళ్లాన్ని మళ్లీ నాకే ఇచ్చి పెళ్లి చేసినట్టు ఉందని’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘ఏనాడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు హక్కులేంటి?. నాటి ప్రభుత్వాల ఇళ్లపై జగన్ పెత్తనమేంటి.?  వేల కోట్ల రూపాయల దోపిడీకి పేదల గూడే దొరికిందా?. పది వేలు కట్టకపోతే పెన్షన్లు ఆపేస్తామనే బెదిరింపులేంటి.?.ఎవరో కట్టిన ఇంటికి జగనన్న హక్కులివ్వడం ఏంటి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ వీడియోను చూడగలరు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement